ఒమన్ లో భారత బృందానికి ఘన స్వాగతం..!

- September 03, 2024 , by Maagulf
ఒమన్ లో భారత బృందానికి ఘన స్వాగతం..!

మస్కట్: ఇండియా నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ప్రతినిధి బృందం ఒమన్ సుల్తానేట్‌లో పర్యటిస్తుంది. ఈ సందర్భంగా బైట్ అల్ ఫలాజ్ గారిసన్‌లోని కళాశాల ప్రధాన కార్యాలయంలో వారిని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ (NDC) కమాండెంట్ రియర్ అడ్మిరల్ అలీ అబ్దుల్లా అల్ షిదీ స్వాగతించారు. ఈ భేటీలో ఇరు పక్షాలు పలు విద్యా, శిక్షణ అంశాలపై చర్చించారు. దీంతోపాటు  NDC మరియు దాని సౌకర్యాల గురించి వారికి వివరించారు. అనంతరంవారు వివిధ విభాగాలను కూడా సందర్శించారు. ఈ సమావేశంలో NDC డైరెక్టర్లు, మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం మిలటరీ అటాచ్ హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com