ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..
- March 19, 2026
అమరావతి: ఏపీలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు శభవార్త చెప్పింది. ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం ఉదయం ఈ ఏడాదికి సంబంధించి ఏపీ ప్రభుత్వ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 10,060 పోస్టులతో ఈ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నామని చెప్పారు. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగిందని చెప్పారు. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తామని చెప్పారు.
ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని అలర్ట్స్ పొందవచ్చునని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇక ప్రతీయేటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండగ ఉంటుందని స్పష్టం చేశారు. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజాప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇక మీరు పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అందరికీ మంత్రి నారా లోకేశ్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
నోటిఫికేషన్ తేదీలు, పోస్టుల సంఖ్య వివరాలు..
♦ మే 15న : ఉన్నత విద్యలో 1500 పోస్టులు
♦ ఆగస్టు 15న : గ్రూప్-1లో 91, హోమ్ శాఖలో 2,778, ఇతర శాఖల్లో 928 పోస్టులు.
♦ సెప్టెంబర్ 15న : గ్రూప్-2లో 750 పోస్టులు, ఇంజనీరింగ్ విభాగంలో 503 పోస్టులు, ఇతర శాఖల్లో 506 పోస్టులు.
♦ అక్టోబర్ 15న : పాఠశాల/ఇంటర్ విద్యలో 3,004 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







