బిగ్ టికెట్ డ్రా.. బంగ్లా ప్రవాసిని వరించిన Dh15 మిలియన్ల బహుమతి..!
- September 04, 2024
యూఏఈ: అల్ ఐన్కు చెందిన బంగ్లాదేశ్‌కు చెందిన నూర్ మియా షంషు మియా సెప్టెంబరు 3న జరిగిన బిగ్ టికెట్ అబుదాబి రాఫిల్ డ్రాలో 15 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకున్నాడు. మియాకు టికెట్ నంబర్ 201918తో అదృష్టం తెచ్చి పెట్టింది. అతను రాఫిల్ డ్రాలో విజేతగా ప్రకటించిన విషయం తెలియగానే ఉద్వేగానికి లోనైనట్టు అల్ ఐన్ నివాసి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తాజా లైవ్ డ్రాలో పది మంది ఒక్కొక్కరు Dh100,000 గెలుచుకున్నారు. ఆగస్టు గ్రాండ్ ప్రైజ్ విన్నర్ తుషార్ దేశ్కర్ తాజా రాఫిల్ డ్రాలో పాల్గొని విజేతను ప్రకటించాడు. ఈ నెల బిగ్ టికెట్ హామీ 20 మిలియన్ దిర్హామ్ గ్రాండ్ ప్రైజ్‌ని అందిస్తోంది. టిక్కెట్లను కొనుగోలు చేసే కస్టమర్లు వారాంతపు ఎలక్ట్రానిక్ డ్రాలో పాల్గొనవచ్చు. ముగ్గురు విజేతలు ఒక్కొక్కరు Dh100,000 గెలుచుకునే అవకాశం ఉంటుంది. Dh20 మిలియన్ గ్రాండ్ ప్రైజ్‌తో పాటు, అక్టోబర్ 3 లైవ్ డ్రాలో పది మంది అదృష్టవంతులు Dh100,000 గెలుచుకుంటారు. దాంతోపాటు Dh400,000 విలువైన సరికొత్త మసెరటి ఘిబ్లీని గెలుచుకుంటారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..