బ్రూనై సుల్తాన్ విలాసాలు....హెయిర్ కట్ కు రూ.16 లక్షలు!

- September 04, 2024 , by Maagulf
బ్రూనై సుల్తాన్ విలాసాలు....హెయిర్ కట్ కు రూ.16 లక్షలు!

ప్రధాని నరేంద్ర మోడీ బ్రూనై పర్యటనకు వెళ్లారు. ఈ తరుణంలోనే అక్కడి దేశ రాజు హసనల్ బోల్కియా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ప్రపంచంలో క్వీన్ ఎలిజిబెత్-2 తర్వాత అత్యధికకాలం పాటు పదవిలో ఉన్న పాలకుడిగా హసనల్ పేరిట రికార్డు నమోదు అయింది. ఈ సుల్తాన్ పూర్తిగా పాశ్చాత్య శైలిలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆ రాజ కుటుంబం సంపద విలువ 40 మిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని అంచనా. ముఖ్యంగా ఆ దేశంలోని చమురు, గ్యాస్ నుంచి వచ్చే డబ్బులే వారి ఆదాయవనరు. 


ఇక బ్రూనై రాజు హెయిర్ కట్ కోసం ఏకంగా వేల కిలోమీటర్లు తన ప్రైవేట్ జెట్ లో 7,000 మైళ్ళు ప్రయాణించి లండన్ లోని ది డోర్ చెస్టర్ హోటల్ లోని మెఫెయిర్ లో ఉన్న బార్బర్ వద్దకు వెళతారు. అక్కడ దాదాపు రూ. 16.5 లక్షల డబ్బులను హెయిర్ కట్ కు కేటాయించేవారు. బ్రూనై సుల్తాన్ ఉండే భవనం పెద్ద కోటాను తలపిస్తుంది. 

దీనిలో 1700 గదులు ఉంటాయని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ లో పేర్కొన్నారు. 257 బాత్రూంలో, 5 స్విమ్మింగ్ పూల్స్ ఇందులో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్యాలెస్ గా ఈ భవనానికి రికార్డు ఉంది. 1984లోనే దీని నిర్మాణానికి 1.4 బిలియన్ డాలర్లను ఖర్చు చేశారు. సుల్తాన్ ప్యాలెస్ లో 100 గ్యారేజీలు ఉన్నాయి వీటిలో 7,000 లగ్జరీ కార్లు ఉన్నాయి.

--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com