‘జనక అయితే గనక’.! సుహాస్ సినిమా పోస్ట్‌పోన్.!

- September 04, 2024 , by Maagulf
‘జనక అయితే గనక’.! సుహాస్ సినిమా పోస్ట్‌పోన్.!

కమెడియన్‌గా పరిచయమైన సుహాస్.. ఇప్పుడు హీరోగా విభిన్నతరహా సినిమాలు చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.

‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్’, ‘ప్రసన్నవదనం’, ‘శ్రీరంగ నీతులు’.. ఇలా ఈ మధ్య చాలానే సినిమాలు రిలీజ్ అయ్యాయ్ సుహాస్ నుంచి.

ఓటీటీలోనూ ఈ సినిమాలు మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయ్. కాగా, ఇప్పుడు ‘జనక అయితే గనుక’ అనే ఓ హిలేరియస్ మూవీతో రాబోతున్నాడు.

ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. కానీ, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలూ, వరదలూ, ఓ పట్టాన వదలడం లేదు. జనం ఇక్కట్లలో చిక్కుకున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్‌ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది నిర్మాణ సంస్థ. దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో శిరీష్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించారు.

‘ఇప్పుడు వర్షాల మోత తర్వాత నవ్వుల మోత’ అంటూ ఈ సినిమా వాయిదా విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే కొత్త రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. ఈ సినిమాలో సుహాస్‌కి జోడీగా సంకీర్తన నటిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com