క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వచ్చేనెల ఒమన్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్

- September 04, 2024 , by Maagulf
క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వచ్చేనెల ఒమన్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్

మస్కట్‌: భారత్‌, పాకిస్థాన్‌ల మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు పండగే. U-19 ఆసియా కప్‌లో మ్యాచ్ అయినా లేదా ప్రపంచ కప్‌లో మ్యాచ్ అయినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ క్రికెట్ దాయాదుల మధ్య జరిగే థ్రిల్లర్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఒమన్ సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా అల్ అమెరత్‌లోని ఒమన్ క్రికెట్ అకాడమీ మైదానంలో అక్టోబర్ 16-27వ తేదీల్లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.   

ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ ఈవెంట్‌లో ఇండియాతోపాటు పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, 2024 ACC పురుషుల ప్రీమియర్ కప్ నుండి మూడు క్వాలిఫైయర్‌ జట్లు పాల్గొంటాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒమన్‌లో జరిగిన ప్రీమియర్ కప్‌కు ఆతిథ్య ఒమన్, యూఏఈ, హాంకాంగ్ జాతీయ జట్లు అర్హత సాధించాయి. యూఏఈ జట్టు ఫైనల్‌లో ఒమన్‌ను ఓడించి 2025 ఆసియా కప్ , ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో బెర్త్‌ను పొందగా, రన్నరప్ ఒమన్, మూడవ స్థానంలో ఉన్న హాంకాంగ్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌కు బెర్త్‌ను ఖాయం చేసుకున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com