హైదరాబాద్‌లో కొత్త వైరస్.. రోజురోజుకు పెరిగిపోతున్న కేసులు...

- September 04, 2024 , by Maagulf
హైదరాబాద్‌లో కొత్త వైరస్.. రోజురోజుకు పెరిగిపోతున్న కేసులు...

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో నోరో వైరస్ కేసులు పెరుగుతున్నాయి, ఇది ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. నోరో వైరస్‌ను వింటర్ వామిటింగ్ బగ్ అని కూడా పిలుస్తారు.ఈ వైరస్ కలుషితమైన నీరు మరియు ఆహారం ద్వారా వ్యాపిస్తుంది.

నోరో వైరస్‌ (Norovirus) అనేది ఒక రకమైన వైరస్‌ గ్యాస్ట్రోఎంటెరిటిస్‌కు (gastroenteritis) కారణమవుతుంది. ఇది కడుపు మరియు ప్రేగుల వాపు, తీవ్రమైన వాంతులు, విరేచనాలకు కారణమవుతుంది.

నోరో వైరస్‌ లక్షణాలు:

  • వాంతులు
  • విరేచనాలు
  • కడుపు నొప్పి
  • చలి జ్వరం
  • నీరసం
  • డీహైడ్రేషన్.

నోరో వైరస్ ఎలా వ్యాపిస్తుంది: 

కలుషితమైన ఆహారం లేదా నీరు ద్వారా వైరస్‌ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉండడం ద్వారా కలుషితమైన ఉపరితలాలను తాకడం ద్వారా నోరో వైరస్ వ్యాపిస్తుంది.

ప్రస్తుతం హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతాల్లో, ముఖ్యంగా యాకత్‌పుర, పురానా హవేలి, మొఘల్ పూర, మలక్ పేట వంటి ప్రాంతాల్లో నోరో వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. GHMC ప్రజలను అప్రమత్తంగా ఉండమని సూచించింది. 

జాగ్రత్తలు:

చేతులను తరచుగా సబ్బుతో కడుక్కోవాలి, వైరస్‌ సోకిన వ్యక్తి ఉపయోగించిన వస్తువులను శుభ్రం చేయాలి.ఈ వైరస్‌ సాధారణంగా 2-3 రోజుల్లోనే తగ్గిపోతుంది, కానీ డీహైడ్రేషన్‌ నివారించడానికి ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడం ముఖ్యం.కాచి చల్లార్చిన, వడపోసిన నీటిని తాగాలి. వైరస్ బారిన పడిన వ్యక్తి ఉపయోగించిన దుస్తులను ఎక్కువ వేడి ఉండే నీటితో శుభ్రం చేయాలి. మీరు కూడా ఈ జాగ్రత్తలు పాటించి, ఆరోగ్యంగా ఉండండి.

--వేణు పెరుమాళ్ల✍🏼(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com