చిన్న కథే కానీ పెద్ద అర్ధమిచ్చారు.! ఎంకరేజ్ చేయాలి బాస్.!
- September 06, 2024
కొన్ని చిన్న సినిమాల్లో కంటెంట్‌ని చాలా బ్రిలియంట్‌గా చెబుతున్నారు. తెలిసిన కథే, మన చుట్టూ సామాన్యంగా జరిగే కథే అయినా దానికి దృశ్య రూపం ఇచ్చే విధానానికి కొన్నిసార్లు హ్యాట్సాఫ్ అనకుండా వుండలేకపోతున్నాం.
అలాంటి సినిమానే ‘35 చిన్న కథ కాదు’. విశ్వదేవ్, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమాలో ప్రియదర్శి ఓ కీలక పాత్ర పోషించాడు.
లెక్కలు సబ్జెక్ట్ అంటే కాదు కాదు, అస్సలు చదువే పడని ఓ కుర్రాడు కష్టపడి 35 మార్కులు తెచ్చుకోవడంలో క్రియేట్ అయిన రకరకాల భావోద్వేగాల సమాహారమే ఈ సినిమా కథ.
రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఓ మంచి ఫీల్‌తో బయటికొస్తున్నారు. నిజానికి ఇలాంటి సినిమాలు ధియేటర్లలో బోర్ కొట్టించేస్తుంటాయ్.
కానీ, ఏ సన్నివేశాన్నీ బోర్ కొట్టించకుండా, గ్రిప్పింగ్‌గా స్క్కీన్‌ప్లే నడిపించాడు దర్శకుడు. సన్నివేశాలకు తగ్గట్లుగానే నటీ నటుల పర్‌ఫామెన్స్ ఆకట్టుకుంటుంది. దాంతో, నిడివితో సంబంధం లేకుండా ఓ ఆహ్లాదమైన అనుభూతికి లోనవుతుంటారు సినిమా చూసే ప్రతీ ఒక్కరూ.
ఆలోచింపచేసేలా వుంది ఈ సినిమా కథ ప్రతీ పేరెంట్‌ని. పేరెంట్స్, టీచర్, ఓ స్టూడెంట్.. ఇలా మూడు కోణాల్లో నడిచిన ఈ కథ చిన్నదే కానీ, పెద్ద అర్ధం ఇచ్చేలా వుంది. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన చిత్రమిది. ‘35 ఒక చిన్న కథ’.. కానీ అందరూ చూడదగ్గ పెద్ద కథ.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …