మొత్తానికి వారసుడొచ్చేశాడు.! ‘సింబా’ ఈజ్ కమింగ్.!
- September 06, 2024
వారసుడొచ్చేశాడు. అదేనండీ.! నందమూరి వారసుడు బాలయ్య ముద్దుల తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ షురూ అయ్యింది.
ఈ దర్శకుడు, ఆ దర్శకుడు.. అంటూ ఫైనల్‌గా ‘హనుమాన్’ సంచలన దర్శకుడు ప్రశాంత్ వర్మకు ఓటేశాడు బాలయ్య.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షు నందమూరి తెరంగేట్రం జరుగుతోంది. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్‌పై ప్రచారం జరుగుతోంది. ఫైనల్‌గా ప్రకటించేశారు. గురువారం అనగా సెప్టెంబర్ 5న మోక్షు పుట్టినరోజు సందర్భంగా తన డెబ్యూ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ జరిగింది.
‘సింబా’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. రెగ్యులర్ షూటింగ్ తదితర వివరాలు త్వరలోనే తెలియాల్సి వుంది.
కాగా, ‘సింబా ఈజ్ కమింగ్’ అంటూ రిలీజ్ చేసిన మోక్షు పోస్టర్‌కి నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు. స్టైలింగ్, లుక్స్‌లో మోక్షు మేకోవర్‌కి సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపో్తున్నారు. చూడాలి మరి, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ద్వారా పరిచయమవుతున్న మోక్షు తెరంగేట్రం ఎలా వుండబోతోందో.!
తాజా వార్తలు
- యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు
- ఏపీ డిజిటల్ గవర్నెన్స్: అన్నీ ఇక ఇ-ఫైళ్లే..
- తెలంగాణలో కొత్త హైకోర్టు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్‌లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!







