‘మిస్టర్ బచ్చన్’ నష్టాల పూడ్చివేత.!
- September 06, 2024
భారీ అంచనాలతో ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్‌లో మూడో సినిమాగా వచ్చిన సినిమా ఇది.
సినిమాని తొందరగానే కంప్లీట్ చేశారు. రీమేక్ మూవీ కదా అందుకేమో. కానీ, ప్రమోషన్లు బాగానే చేశారు. అయినా సినిమాలో కంటెంట్ వుండాలిగా. రీమేకుల స్పెషలిస్ట్ అయిన హరీష్ శంకర్ ఎందుకో ఫెయిలయ్యాడు.
రవితేజకు టైమ్ అస్సలు బాగా లేదు. దాంతో, హిట్టు రీమేక్ అయినా ఫట్ అయిపోయింది. దాంతో నిర్మాతలు భారీగా నష్టపోయారు.
ఆ నష్టాన్ని పూడ్చే పనిలో పడ్డారు హీరో, దర్శకుడు. తమ రెమ్యునరేషన్లలో కోతలు విధించుకున్నారు. రవితేజ తన రెమ్యునరేషన్‌లో నాలుగు కోట్లు వెనక్కి తిరిగిచ్చేశాడు.
అలాగే, హరీష్ శంకర్ రెండు కోట్లు తిరిగిచ్చేశాడనీ సమాచారం. ఎన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ గుప్పించినా ‘మిస్టర్ బచ్చన్’ ఎందుకో జనానికి ఎక్కలేదు.
సెలవులు కూడా ‘మిస్టర్ బచ్చన్’ని ఆదుకోలేకపోయాయ్. ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా పరిచయమైన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!