తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్‌

- September 06, 2024 , by Maagulf
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్‌

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ పేరును పార్టీ హైకమాండ్ ప్రకటించింది. మహేష్ కుమార్ గౌడ్ కు ఇంతటి ప్రాధాన్యత కల్పించడంపై బీసీ సంఘాలు, పార్టీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

పార్టీలో క్రమశిక్షణతో పని చేస్తే ఉన్నత పదవులు కట్టబెడుతుందని కాంగ్రెస్ అగ్రనేతలు చెబుతున్నారు.

బీసీ నేతకు పెద్ద కుర్చి..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ పేరును పార్టీ హైకమాండ్ ప్రకటించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీతో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్లందరితో సత్సంబంధాలు ఉన్న నేపధ్యంలో అధిష్టానం ఆయనకే పట్టం కట్టాలని నిర్ణయించింది. బీసీ నేతకు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై బీసీ నాయకులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

టీపీసీ చీఫ్ గా నియామక పత్రం..

మహేష్ కుమార్ గౌడ్ కు ఇంతటి ప్రాధాన్యత కల్పించడంపై బీసీ సంఘాలు, పార్టీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు. పార్టీలో క్రమశిక్షణతో పని చేస్తే ఉన్నత పదవులు కట్టబెడుతుందని కాంగ్రెస్ అగ్రనేతలు చెబుతున్నారు.

ప్రొఫైల్..

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్ పేరును హైకమాండ్ ఖరారు చేసింది. 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ లోని భీంగల్ మండలం రహత్నగర్ లో మహేష్ కుమార్ గౌడ్ జన్మించారు. NSUI రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా సేవలందించారు. 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా డిచ్పల్లి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. 2013 నుంచి 2014 వరకు గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ గా పనిచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com