వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- September 07, 2024
అమరావతి: వరద ముంపు ప్రాంతాల పరిశీలన, సహాయక చర్యల పర్యవేక్షణతో గత కొన్ని రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. విజయవాడ వరద గుప్పిట్లో చిక్కుకున్నప్పటి నుంచి ఆయన విజయవాడ కలెక్టరేట్ తన నివాసంగా చేసుకున్నారు.
అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు ఇవాళ వినాయక చవితి పండుగను తన నివాసంలో కాకుండా విజయవాడ కలెక్టరేట్ లోనే జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణేశుని పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదపండితులు సీఎంకు ఆశీర్వచనం అందించారు. ఈ పూజలో చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!