టూరిస్టులకు స్పెషల్ అట్రాక్షన్.. 'వెల్కమ్ టు దుబాయ్' భారీ లాన్..!
- September 08, 2024
యూఏఈ: 360,000 చదరపు మీటర్ల మేనిక్యూర్డ్ లాన్ల నుండి మెరుస్తున్న ‘వెల్కమ్ టు దుబాయ్’ మెసేజ్ దుబాయ్‌కి వచ్చే సందర్శకులు విమానాశ్రయంలో దిగినప్పుడు చూసే మొదటి ల్యాండ్ స్రేప్ లలో ఒకటి అవుతుంది. విమానాశ్రయం - షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ల కూడలి వద్ద 26 మిలియన్ దిర్హామ్‌ల ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తయిందని దుబాయ్ మునిసిపాలిటీ (DM) తెలిపింది. తాజాగా వీటికి సంబంధించిన ఫోటోలను విడుదల చేసారు.
ప్రాజెక్ట్ ఆధునిక డిజైన్‌ను కలిగి ఉంది. కళాకృతిలో భాగంగా, వివిధ రకాల వృక్షాలతో పాటు 50వేల మొక్కలు పొదలను ఏర్పాటు చేశారు. ఆధునిక నీటిపారుదల వ్యవస్థతో ఆప్టిమైజ్ చేస్తూ పచ్చదనాన్ని నిర్వహిస్తున్నారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దార్శనికతకు అద్దంపట్టేలా.. ప్రపంచంలో నివసించడానికి దుబాయ్‌ని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా స్థాపించడానికి ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేసినట్టు అని DM డైరెక్టర్ జనరల్ దావూద్ అల్ హజ్రీ తెలిపారు. గత సంవత్సరం అల్ రఖా, నాద్ అల్ షెబా, నాద్ అల్ హమర్, అల్ ఖవానీజ్ ప్రాంతాలలో నాలుగు రౌండ్అబౌట్లలో ప్రత్యేకమైన గ్రీన్ ఆర్ట్‌వర్క్‌లను కూడా పూర్తి చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







