దుబాయ్ ని వదులుతున్న టెనేంట్స్..!
- September 08, 2024
యూఏఈ: దుబాయ్‌లోని చాలా మంది అద్దెదారులు షార్జా, ఉత్తర ఎమిరేట్లకు షిఫ్ట్ అవుతున్నారు. అధిక రెంట్స్, పెరిగిన ట్రాఫిక్, ఉద్యోగులకు హైబ్రిడ్ వర్క్ ఏర్పాట్ల కారణంగా నివాసితులు దుబాయ్ ను వీడుతున్నారు. ఇలా కొత్త ప్రాంతాలకు వెళ్లడం ద్వారా దాదాపు Dh77,000 ఆదా చేసుకోవచ్చని ఇండస్ట్రీ అధికారులు సూచిస్తున్నారు. దుబాయ్, షార్జా మరియు నార్తర్న్ ఎమిరేట్స్‌లలో అద్దెలు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగాయి. యూఏఈలో జనాభా పెరగడం, వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాల నేపథ్యంలో వలసలు పెరిగాయి. అయితే, దుబాయ్‌లో అద్దెలు పొరుగున ఉన్న ఉత్తర ఎమిరేట్ల కంటే రెండింతలు ఎక్కువ కావడం గమనార్హం.
దుబాయ్‌లో స్టూడియో అద్దె సంవత్సరానికి Dh30,000 నుండి Dh70,000 వరకు ఉంటుంది. అయితే సింగిల్ బెడ్ రూమ్ Dh50,000 నుండి Dh130,000 వరకు ఉంటుంది. దుబాయ్‌లో దీరా, ఇంటర్నేషనల్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, జుమేరా విలేజ్ అత్యంత సరసమైన ప్రాంతాలు కాగా..పామ్ జుమేరా, దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC) , డౌన్‌టౌన్ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకోవడానికి అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా ఉన్నాయి. అదే షార్జాలో Dh12,000 నుండి Dh40,000 మధ్య స్టూడియోల రెంట్స్, సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్లు Dh14,000 నుండి Dh55,000 వరకు ఉంటాయి. ఉత్తర ఎమిరేట్స్ అజ్మాన్, ఉమ్ అల్ క్వైన్, ఫుజైరా, రస్ అల్ ఖైమాలో స్టూడెయో రెంట్స్ Dh12,000-Dh34,000, సింగిల్ బెడ్ రూమ్ దాదాపు Dh15,000-Dh50,000 వరకు ఉన్నాయని Asteco వద్ద అడ్వైజరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జేమ్స్ జోగిన్ తెలిపారు. అయితే, ఇతర ఎమిరేట్స్‌లో విస్తృతమైన ట్రాఫిక్ రద్దీ కారణంగా కొంతమంది నివాసితులు దుబాయ్‌కి తిరిగి వచ్చారని, కొందరు రోజూ 1.5 గంటలకు పైగా ట్రాఫిక్‌లో గడుపుతున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!