సౌదీలో పడవలపై తొలిసారిగా నియంత్రణ..ఇక లైసెన్సులు తప్పనిసరి..!
- September 08, 2024
జెడ్డా: సౌదీ ఎర్ర సముద్రం అథారిటీ (SRSA) తన భౌగోళిక పరిధిలో సౌదీ అరేబియాలో పడవల కదలికలపై మొదటిసారిగా నియంత్రణలు విధించింది. యాచ్ కార్యకలాపాలను నియంత్రించడం, టూరిజం మరియు లీజర్ లైసెన్స్లు, పర్మిట్ల జారీని నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఈ నియంత్రణ పర్యావరణ పరిరక్షణ, తీరప్రాంత పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి దోహం చేస్తుందన్నారు. పర్యాటకం కోసం లైసెన్సులను జారీ చేయడానికి షరతులు, విధానాలను రూపొందించారు. సముద్ర పర్యాటక ఏజెంట్ లేదా యాచ్ మేనేజ్మెంట్ కంపెనీలకు లైసెన్స్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని అథారిటీ స్పష్టం చేసింది. సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్ర జలాల్లో ఫిషింగ్, డైవింగ్ వంటి కార్యకలాపాలకు ఆమోదం తప్పనిసరి చేశారు.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!