కువైట్‌కు 34 శాతం పెరిగిన ఇండియా ఎగుమతులు..!

- September 08, 2024 , by Maagulf
కువైట్‌కు 34 శాతం పెరిగిన ఇండియా ఎగుమతులు..!

కువైట్: ఇటీవల కాలంలో కువైట్‌తో భారతదేశ వాణిజ్యం అసాధారణంగా పెరిగింది. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారిక డేటా ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో గల్ఫ్ దేశానికి భారతీయ ఎగుమతులు USDS 2.10 బిలియన్లకు చేరుకున్నాయి.   గత ఆర్థిక సంవత్సరంలో USD 1.56 బిలియన్లతో పోలిస్తే FY-2023-24లో వాణిజ్యంలో పెరుగుదల 34.78 శాతంగా నమోదైంది. ఎగుమతులలో ఈ పెరుగుదల రెండు దేశాల మధ్య బలమైన వాణిజ్య సంబంధాలను కూడా హైలైట్ చేసిందని నివేదికలో పేర్కొన్నారు. విమానం, అంతరిక్ష నౌక భాగాలు, తృణధాన్యాలు, ఆభరణాలు, ఇమిటెట్ నగలు, నాణేలు, వాహనాలు (రైల్వే లేదా ట్రామ్‌వే రోలింగ్ స్టాక్ మినహా), ఔషధ ఉత్పత్తులు ఎగుమతి వృద్ధికి దోహదపడ్డాయి. అదే సమయంలో పెట్రోలియం వనరులతో నడిచే కువైట్ ఆర్థిక వ్యవస్థ భారతదేశానికి ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. దేశంలో 101.5 బిలియన్ బ్యారెల్స్ ముడి చమురు నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోని మొత్తం నిల్వలలో సుమారు 6 శాతం. తాజా OPEC డేటా ప్రకారం 1,784 బిలియన్ క్యూబిక్ మీటర్లు లేదా 63 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల నిరూపితమైన సహజ వాయువు నిల్వలను కువైట్ కలిగి ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com