భారత విదేశాంగ మంత్రితో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!

- September 10, 2024 , by Maagulf
భారత విదేశాంగ మంత్రితో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!

రియాద్: భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ సమావేశమయ్యారు. రియాద్‌లోని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సెక్రటేరియట్ జనరల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై సమీక్షించారు.ద్వైపాక్షిక సంబంధాలు, సహకారంపై చర్చించారు. సంబంధాలను బలోపేతం చేసుకునే మార్గాల గురించి అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. తాజా ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ప్రారంభమైన జిసిసి-ఇండియా జాయింట్ మినిస్టీరియల్ మీటింగ్ ఫర్ స్ట్రాటజిక్ డైలాగ్‌లలో పాల్గొనడానికి సుబ్రహ్మణ్యం జైశంకర్ రియాద్ లో పర్యటిస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com