అక్టోబరు 4 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
- September 10, 2024
తిరుమల: తిరుమలలో వచ్చే నెల (అక్టోబర్) లో జరిగే విశేష ఉత్సవాలను టీటీడీ అధికారులు ప్రకటించారు. అక్టోబర్ నాలుగు నుంచి 12వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నట్టు ప్రకటించారు. కాగా అక్టోబర్ 3న అంకురార్పన జరగనుండగా.. అక్టోబరు 4న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టిటిడి అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహన సేవలు ఉంటాయి. అక్టోబరు 8వ తేదీన గరుడ సేవ ఉంటుంది. ఇక అక్టోబరు 9వ తేదీన స్వర్ణరథం, 11వ తేదీన రథోత్సవం ఉంటాయి. ఇక 12వ తేదీన చక్రస్నానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల వేళ పలు రకాల ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేయనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







