రాష్ట్రానికి మరో నాలుగు మెడికల్‌ కాలేజీలు!

- September 10, 2024 , by Maagulf
రాష్ట్రానికి మరో నాలుగు మెడికల్‌ కాలేజీలు!

హైదరాబాద్: తెలంగాణలో మరో నాలుగు మెడికల్ కాలేజీలకు కేంద్ర ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్ర‌భుత్వం దరఖాస్తు చేసుకున్న యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వాలని జాతీయ వైద్య కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ (మంగళవారం) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com