ఇరాక్ లో కారు బాంబు పేలుళ్లు
- July 05, 2015
ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగర శివారు ప్రాంతం శనివారం రాత్రి కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లలో 19 మంది మృతి చెందగా... దాదాపు 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఉన్నతాధికారులు వెల్లడించారు. బాగ్దాద్ పశ్చిమ ప్రాంతంలో వాణిజ్య కేంద్రం వద్ద కారు బాంబు పేలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే దక్షిణ బాగ్దాద్ లోని బస్ స్టాప్ వద్ద కారు బాంబు పేలుడులో ముగ్గురు మరణించగా... 15 మంది గాయపడ్డారు. ఇక్కడికి సమీపంలోని మార్కెట్ బయట బాంబుపేలి... ముగ్గురు దుర్మరణం పాలైయ్యారు. షీట్ పట్టణంలోని రెస్టారెంట్స్ వద్ద కారు బాంబు పేలుడు సంభవించగా... నలుగురు మృతి చెందగా...14 మంది గాయపడ్డారు. అయితే ఈ దాడులకు తామే బాధ్యులమంటూ ఇప్పటి వరకు ఏ సంస్థ ప్రకటించలేదని ఉన్నతాధికారులు వెల్లడించారు.
(మాగల్ఫ్ ప్రతినిధి,ఇరాక్)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









