సౌదీ వాణిజ్యంలో ఇ-కామర్స్ 8%.. నవంబర్ 5న బిబాన్ 24 ఫోరమ్..!!
- September 11, 2024
బురైదా: సౌదీ అరేబియాలోని మొత్తం వాణిజ్యంలో ఇ-కామర్స్ రంగం 8% వాటాను కలిగి ఉందని సౌదీ వాణిజ్య మంత్రి మాజిద్ అల్-కసాబీ తెలిపారు. అంచనాల ప్రకారం.. 2025 నాటికి ఈ రంగం ఆదాయాలు SR260 బిలియన్లకు చేరుకుంటాయని భావిస్తున్నారు. ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు 95% పెరిగాయని, 2018లో కేవలం 10 కంపెనీల సంఖ్య మాత్రమే ఉన్నందున ప్రస్తుతం 170కి పైగా పెరిగాయని అల్-కసాబీ తెలిపారు. ఖాసిం ఛాంబర్లో వ్యాపారులు, మహిళలు, పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వినియోగదారుల రక్షణకు సంబంధించి.. మార్కెట్, ధరల నియంత్రణ, మోసాలను ఎదుర్కోవడం, వాణిజ్యపరమైన కవర్-అప్ కోసం నియమాలు రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నిపుణుల అథారిటీ అధ్యయనం చేస్తున్న వినియోగదారుల రక్షణ వ్యవస్థ ఉందని ఆయన అన్నారు. రుణ సౌకర్యాలలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల వాటా SR275 బిలియన్లు, మొత్తంగా 8.7% నికి సమానం అని మంత్రి వివరించారు. నవంబర్ 5న రియాద్‌లో నిర్వహించనున్న బిబాన్ 24 ఫోరమ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎంటర్‌ప్రైజెస్‌కు, పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!







