వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్.. బహ్రెయిన్‌లో పంజాబ్ సాంస్కృతిక వైభవం..!!

- September 11, 2024 , by Maagulf
వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్.. బహ్రెయిన్‌లో పంజాబ్ సాంస్కృతిక వైభవం..!!

మనామా: బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ODOP) కార్యక్రమం కింద పంజాబ్ సాంస్కృతిక, ఆర్థిక ప్రాముఖ్యతను ప్రదర్శించే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. "పంజాబ్ స్టేట్ టూరిజం అండ్ ODOP" పేరుతో జరిగిన ఈ కార్యక్రమం బహ్రెయిన్‌లోని భారత రాయబారి హిస్ ఎక్సలెన్సీ వినోద్ కె. జాకబ్ ఆధ్వర్యంలో ఎంబసీ ప్రాంగణంలో జరిగింది.  ప్రతి భారతీయ రాష్ట్రం ప్రత్యేక సాంస్కృతిక విలువలు, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో భారత ప్రభుత్వం విస్తృత కార్యక్రమంలో ఇది భాగంగా ఉంది.

పంజాబ్ సహా సంస్కృతి, ఉత్పత్తులు,  పర్యాటక అవకాశాలలో ఇండియా వైవిధ్యభరితమైన అవకాశాల గురించి ప్రపంచ దేశాల్లో అవగాహనను పెంపొందించే లక్ష్యంతో కొన్ని నెలల క్రితం ప్రారంభమైన ODOP కార్యక్రమం రాష్ట్రాలవారీగా నిర్వహిస్తున్నారు.  “ఈ కార్యక్రమం భారతదేశంలోని ప్రతి రాష్ట్ర ప్రాముఖ్యతను ప్రదర్శిస్తుంది. వారి ఉత్పత్తులు, సంస్కృతి,  పర్యాటక విలువను పెంచడంలో సహాయపడుతుంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా, మేము ప్రతి ప్రాంతం గొప్ప వారసత్వాన్ని ప్రోత్సహించడం, సంరక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నాము.’’ అని రాయబారి జాకబ్ వివరించారు.   బహ్రెయిన్‌లోని పంజాబీ కమ్యూనిటీకి చెందిన సీనియర్ సభ్యుడు K. N. సింగ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.   ఇండియా-బహ్రెయిన్ మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసేందుకు రాయబార కార్యాలయం ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com