ప్రకాశం బ్యారేజీని సందర్శించిన కేంద్ర బృందం
- September 12, 2024
అమరావతి: ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం సందర్శించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించింది. ఇటీవల కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీ, తెలంగాణలలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈరోజు కేంద్రబృందం బ్యారేజీని పరిశీలించింది.
బ్యారేజీ నీటి ప్రవాహం తదితర విషయాలను జలవనరుల శాఖ అధికారులు కేంద్ర బృందానికి వెల్లడించారు. ఈఎస్‌సీ వెంకటేశ్వర్లు ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు. ఈ నెల 1న రికార్డ్ స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో పరిస్థితి, ముంపునకు సంబంధించిన వివరాలను ఈ బృందం దృష్టికి తీసుకువెళ్లారు.
ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం 15.30 అడుగులుగా నమోదైంది. ఇక్కడి నుంచి సముద్రంలోకి 15.24 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కోనసీమలో లంక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉండటంతో పడవల ద్వారా రాకపోకలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలచిపోయాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







