సినిమా రివ్యూ: ‘మత్తు వదలరా 2’

- September 14, 2024 , by Maagulf
సినిమా రివ్యూ: ‘మత్తు వదలరా 2’

రాజమౌళి ఫ్యామిలీ హీరో శ్రీ సింహా ప్రధాన పాత్రలో, కాల భైరవ మ్యూజిక్ డైరెక్షన్‌లో ఐదేళ్ల క్రితం వచ్చిన సినిమానే ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అప్పట్లో ఓ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది ఆడియన్స్.డిఫరెంట్ థ్రిల్ మూవీగా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కిందే ‘మత్తు వదలరా 2’. శ్రీ సింహా, కమెడియన్ సత్య మెయిన్ లీడ్ పోషించగా, ఫఱియా అబ్ధుల్లా ఫిమేల్ లీడ్ పోషించింది. మొదటి పార్ట్ ఇచ్చిన కిక్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయ్ ఆడియన్స్‌లో. అలా పెరిగిన అంచనాల్ని ‘మత్తు వదలరా 2’ అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
బాబూ మోహన్ (శ్రీ సింహా), బుజ్జి ఇద్దరూ డెలివరీ బాయ్స్‌గా పని చేస్తుంటారు. అయితే, అనుకోకుండా ఓ డ్రగ్ కేసులో ఇరుక్కోవడం వల్ల ఉద్యోగం కోల్పోతారు. ఉద్యోగం కోసం వెతుకుతున్న ఈ ఇద్దరికీ హై ఎమర్జెన్సీ (హీ) టీమ్‌లో స్పెషల్ ఏజెంట్స్‌గా పని చేసే అవకాశం దక్కుతుంది. ఈ టీమ్‌లో భాగంగా  కిడ్నాపర్లను పట్టుకోవడంలో మంచి పట్టు సాధిస్తారు. ఆ తర్వాత ఆ కిడ్నాపర్ల నుంచి అన్‌అఫీషియల్‌గా కొంత డబ్బు లాగేస్తూ కొంత మేర లాభపడుతుంటారు. కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలనీ ఎన్నాళ్లని చిన్నా చితకా కమీషన్లతో సరిపెట్టుకుంటామని ఓ ప్లాన్ వేస్తారు. అందులో భాగంగా రెండు కోట్ల డీల్‌తో ఓ కిడ్నాప్ కేస్ ఛేధించడానికి రంగం సిద్ధం చేసుకుంటారు. అంతా కరెక్ట్‌గా జరుగుతోందనుకున్న తరుణంలో అనుకోకుండా మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. అసలింతకీ ఆ కిడ్నాప్‌లో చనిపోయిందెవరు.? కావాలని వీళ్లని ఆ మర్డర్ కేసులో ఇరికించిందెవరు.? చివరికి వాళ్లు అనుకున్నట్లుగా 2 కోట్లు సంపాదించారా.? లేదా.? తెలియాలంటే సినిమా థియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
ఈ సినిమాలో హీరో శ్రీ సింహా అయినప్పటికీ సినిమా భారం మొత్తం మోసింది కమెడియన్ సత్యనే. వన్ మ్యాన్ షో‌లా సినిమాని నవ్వులతో నింపేశాడు. తనదైన పంచ్ డైలాగులతో కడుపుబ్బా నవ్వించేశాడు. శ్రీ సింహా తొలి సినిమాతో పోల్చితే నటనలో కాస్త ఇంప్రూవ్ అయ్యాడు. ఆ పాత్రకు తాను యాప్ట్ అనిపించుకుంటాడు. హీరోయిన్ ఫరియా అబ్ధుల్లా తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించడమే కాకుండా.. ఈ సినిమాలో యాక్షన్ సీన్లలోనూ ఇరగదీసేసింది కామెడీగా. అలాగే హాట్‌గా కూడా కనిపించింది. మిగిలిన పాత్రధారులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
రచయిత కమ్ డైరెక్టర్ అయిన రితేష్ రాణా ఈ సినిమా కోసం కూడా మంచి కథే రాసుకున్నాడు. తొలి పార్ట్‌కి కొనసాగింపుగా డ్రగ్స్ నేపథ్యంలోనే కథ అల్లుకున్నాడు. కానీ, కథనం నడిపించడంలో తొలి పార్ట్‌కి సక్సెస్ అయినంత స్థాయిలో ఈ పార్ట్‌కి సక్సెస్ కాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. ప్రధమార్ధాన్ని కామెడీతో బాగానే నడిపించేశాడు. కానీ, ద్వితీయార్ధానికొచ్చేసరికి కాస్త తడబడ్డాడు. ‘మత్తు వదలరా’ పార్ట్ 1లో కామెడీతో పాటూ, అనూహ్యమైన ట్విస్టులు ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తాయ్. కానీ, ఈ పార్ట్‌లో ఆ తరహా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వున్నప్పటికీ అవేమంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అయితే, ఈ సినిమాకి కూడా కాల భైరవ మ్యూజిక్ ప్రాణం అని చెప్పాలి. కథనానికి తగ్గట్లుగా క్రేజీ మ్యూజిక్ ఇచ్చాడు. రొటీన్‌కి భిన్నంగా కాల భైరవ అందించిన మ్యూజిక్ సరికొత్త ఫీల్ ఇస్తుంది. చిరంజీవి (చెర్రీ) సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. డైలాగ్స్ బాగున్నాయ్. నిర్మాణ విలువలు బాగున్నాయ్.

ప్లస్ పాయింట్స్:
నటీ నటుల పర్‌ఫామెన్స్, ముఖ్యంగా సత్య నటన, కామెడీ, ప్రధమార్ధం, అక్కడక్కడా కొన్ని ట్విస్లులు.

మైనస్ పాయింట్స్:
కథనం, ద్వితీయార్ధం, ఊహించిన విధంగా కథలో ట్విస్టులు లేకపోవడం,

చివరిగా:
‘మత్తు వదలరా 2’.. కడుపుబ్బా నవ్వించే నవ్వుల బండి. నవ్వులు మాత్రమే ఆశిస్తే.. పైసా వసూల్. నో నిరాశల్.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com