‘సత్యం సుందరం’.! కార్తీ కొత్త సినిమా టీజర్ చూశారా.?

- September 14, 2024 , by Maagulf
‘సత్యం సుందరం’.! కార్తీ కొత్త సినిమా టీజర్ చూశారా.?

ఈ పేరుకి టాలీవుడ్‌లో మంచి క్రేజ్ వుంది. పురానా జమానా కాలం నుంచి ఈ టైటిల్‌ తెలుగు ప్రేక్షకులకి చాలా క్యాచీగా వస్తున్న టైటిల్. ఇప్పుడీ టైటిల్ టాపిక్ ఎందుకొచ్చిందంటారా.?
ఈ టైటిల్‌తో ఓ సినిమా వస్తోంది. తమిళ డబ్బింగ్ సినిమానే. కానీ, కార్తి హీరోగా వస్తున్న సినిమా అది. లేటెస్ట్‌గా టీజర్ వదిలారు. అసలే కార్తిని తమిళ హీరోలా లెక్క చేయరు మన తెలుగోళ్లు.
మన తెలుగబ్బాయే.. పక్కింటబ్బాయ్.. కాదు కాదు మన ఇంట్లో కుర్రాడే అనేంతలా ఓన్ చేసుకున్నారు. నాగార్జునతో కార్తి చేసిన ‘ఊపిరి’ సినిమాని తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుని చూస్తుంటారు.
అలాంటి కార్తి నటించిన సినిమా తెలుగు వెర్షన్‌కి అసలు సిసలు తెలుగు టైటిల్ పెట్టి వదులుతున్నారు. టీజర్ విషయానికి వస్తే.. నాని తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు ఈ సినిమాలో.
అన్నట్లు హ్యాండ్‌సమ్ సీనియర్ హీరో అరవింద్ స్వామి ఈ సినిమాలో మరో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. బావ బావమరుదులుగా ఈ సినిమాలో కార్తి, అరవింద్ స్వామి నటిస్తున్నారు. టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. డిశంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com