‘గేమ్ ఛేంజర్’ స్టేటస్ సంగతేంటో.!

- September 14, 2024 , by Maagulf
‘గేమ్ ఛేంజర్’ స్టేటస్ సంగతేంటో.!

‘గేమ్ ఛేంజర్’ సినిమా డిశంబర్‌లో అది కూడా క్రిస్మస్ స్పెషల్‌గా రానుందని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని మెగా తనయుడు, గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆల్రెడీ కన్‌పామ్ చేశాడు కూడా.
కానీ, ఈ మధ్య అనౌన్స్‌మెంట్లు జరిగిన సినిమాలు కూడా అర్ధాంతరంగా వాయిదా పడుతున్నాయ్. పెద్ద హీరో, చిన్న హీరో అనే తేడా లేదు. ‘పుష్ప2’ విషయంలో, ‘దేవర’ విషయంలో ఏం జరిగిందో తెలిసిందే. సరే, ‘గేమ్ ఛేంజర్’ విషయానికి వస్తే.. ఈ సినిమా ఇప్పటికే వచ్చేయాల్సి వుంది.
కానీ, శంకర్ మేకింగ్ ప్రాబ్లమో, లేక, ఇతరత్రా టెక్నికల్ ఇష్యూస్ రీజనో తెలీదు కానీ, ఇంతవరకూ స్టేటస్ కూడా తెలిసి రావడం లేదు. సినిమా అయిపోయిందనే అంటున్నారు. కానీ, అప్డేట్స్ మాత్రం వదలడం లేదు.
మొన్న వినాయక చవితికి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. సెకండ్ సింగిల్ అన్నారు.. ఇంతవరకూ ఎలాంటి అప్టేట్ లేదు. మెగా అభిమానుల ఆశలన్నీ నిరాశలవుతున్నాయ్. ఈ లోపు బురద జల్లే టీమ్ తనదైన స్టైల్‌లో ముందుకు దూసుకొస్తోంది.
నో వే.! ‘గేమ్ ఛేంజర్’ ఇప్పట్లో వచ్చే ఛాన్సే లే.! అంటూ దుష్ప్రచారాలు మొదలెట్టేసింది. డిశంబర్‌లో పెద్ద సినిమా ‘పుష్ప 2’ వుంది. అలాగే క్రిస్మస్‌కి ఐదు రోజులు ముందే అంటే 20 న నాగ చైతన్య ‘తండేల్’ వుంది. ‘గేమ్ ఛేంజర్’ వస్తే.. ఈ సినిమాల పరిస్థితేంటీ.? అసలే, ఆల్రెడీ ఓ సారి చైతూ సినిమా వాయిదా పడింది. ‘పుష్ప 2’ సినిమా విషయంలో అల్లు వెర్సస్ మెగా రచ్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘గేమ్ ఛేంజర్’ పరిస్థితేంటో అని మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆ ఆందోళన తీరాలంటే ‘గేమ్ ఛేంజర్’ టీమ్ ఒకింత దూకుడు ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com