షిఫా యాప్‌లో కొత్త సేవలు..ప్రారంభించిన ఒమన్ హెల్త్ మినిస్ట్రీ
- September 14, 2024
మస్కట్: షిఫా యాప్‌లో కొత్త సేవను ప్రారంభించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ అహ్మద్ సలీం అల్ మంధారి తెలిపారు. హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూషన్లలో మిస్ అయ్యే అపాయింట్మెంట్ల సంఖ్యను తగ్గించడం కొత్త సర్వీస్ లక్ష్యమని తెలిపారు. కొత్త మార్పు ప్రకారం.. అతని/ఆమె అపాయింట్మెంట్ టైమ్ దాటగానే వారి ఫోన్‌కు మెసేజ్ వెళుతుంది. రోగి షిఫా యాప్‌ని యాక్సెస్ చేసి సరైన కారణాలను తెలపాలి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మిస్ అయిన అపాయింట్మెంట్ల కారణాలను విశ్లేషిస్తుంది. ఈ చొరవ అపాయింట్మెంట్ వృధాను తగ్గించడానికి, అందించిన ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యతను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







