సౌదీ అరేబియాలో మాజీ సెక్యూరిటీ చీఫ్‌కి 20 సంవత్సరాల జైలు శిక్ష..!
- September 14, 2024
రియాద్: అవినీతి కేసులో అరెస్టయిన మాజీ పబ్లిక్ సెక్యూరిటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ ఖలీద్ బిన్ కరార్ అల్-హర్బీకి కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధికార దుర్వినియోగం సహా పలు నేరాలకు పాల్పడ్డారని కోర్టు నిర్ధారించింది. లంచం, ఫోర్జరీ ఇతర సంబంధిత నేరాలకు పాల్పడినందుకు పదేళ్ల జైలు శిక్ష, SR1,000,000 జరిమానా విధించింది. అల్-హర్బీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన పదవిని దుర్వినియోగం చేయడం, ప్రభుత్వ ఒప్పందాలను ఉల్లంఘించడం, ప్రజా నిధులను దుర్వినియోగం చేయడం వంటి నేరాలకు మరో పదేళ్ల జైలు శిక్ష విధించారు. జైలు శిక్ష, జరిమానాతో పాటు SR10,084,303 లంచం సొమ్మును స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. అలాగే పబ్లిక్ ఫండ్ నుండి అపహరించిన SR2,827,000ను సేకరించి ఖజానాకు జమ చేయాలని కోర్టు తన తీర్పులో ఆదేశించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







