యూఏఈల హెల్త్ కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

- September 14, 2024 , by Maagulf
యూఏఈల  హెల్త్ కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

యూఏఈ: యూఏఈలో నివసించడం అనేది వృత్తిపరంగా, వ్యక్తిగతంగా చాలా డిమాండ్‌గా ఉంటుంది. ఇది కొన్నిసార్లు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. అందుకే ఆరోగ్య బీమా కలిగి ఉండటం చాలా కీలకమన్నారు. పనిచేసే కంపెనీ మీకు ఆరోగ్య బీమాను అందించినా లేదా యూఏఈ పౌరుడిగా లేదా నివాసిగా ఆరోగ్య కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఎమిరేట్స్ హెల్త్ సర్వీసెస్ (EHS) జారీ చేసిన ఈ కార్డ్ మీకు ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తుంది.  EHS హెల్త్ కార్డ్‌తో మీరు అన్ని EHS సేవలపై 20 శాతం తగ్గింపు ప్రయోజనం పొందవచ్చు.

హెల్త్ కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో పూర్తి గైడ్:

అర్హత

మీరు యూఏఈ పౌరుడు, GCC పౌరుడు లేదా యూఏఈ నివాసి అయితే, మీరు ఈ సేవ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ (PoD): ప్రభుత్వ సదుపాయం నుండి 3 నెలల వైద్య నివేదిక, పాస్పోర్ట్, ఎమిరేట్స్ ID సమర్పించాలి. హెల్త్ కార్డ్‌ని పొందాలనుకునే నివాసి అయితే, చెల్లుబాటు అయ్యే ఎమిరేట్స్ IDని మాత్రమే సమర్పించాలి. పౌరులైతే ఎమిరేట్స్ IDతోపాటు ఫ్యామిలీ బుక్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది.

చెల్లుబాటు

మీరు యూఏఈ లేదా GCC జాతీయులైతే హెల్త్ కార్డ్ ఐదేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. నివాసి అయితే కార్డ్ ఒక సంవత్సరం మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

రుసుములు

PoD కోసం దరఖాస్తు చేయడానికి Dh50 చెల్లించాలి.  ప్రవాసులు హెల్త్ కార్డ్ జారీ కోసం Dh100 తోపాటు EHS దరఖాస్తు ఫారమ్ కోసం అదనంగా Dh15 చెల్లించాలి. EHS వెబ్‌సైట్ (ehs.gov.ae)లో దరఖాస్తు చేయాలి. హెల్త్ కార్డ్ కోసం దరఖాస్తు కోసం వివిధ వివరాలను నమోదు చేసి దరఖాస్తును పూరించాలి. అలాగే  EHS యాప్ ద్వారా హెల్త్ కార్డ్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. PoD హెల్త్ కార్డ్ కోసం దరఖాస్తు చేస్తున్నట్లయితే, ఎమిరేట్స్ IDకి హెల్త్ కార్డ్ లింక్ కావడానికి ఏడు నుండి 30 రోజుల మధ్య సమయం పడుతుంది. EHS-ఆపరేటెడ్ హెల్త్ ఫెసిలిటీస్ వద్ద మాత్రమే హెల్త్ కార్డ్ చెల్లుబాటు అవుతుంది. వీటిలో దుబాయ్ పబ్లిక్ హెల్త్ సెంటర్, షార్జాలోని అల్రిఫా హెల్త్ సెంటర్, ఫుజైరాలోని మసాఫీ హాస్పిటల్, ఉమ్ అల్ క్వైన్‌లోని ఫలజ్ అల్ ముల్లాహ్ ఫిజియోథెరపీ సెంటర్, ఫిజియోథెరపీ స్పోర్ట్స్ మెడిసిన్ ఉన్నాయి. రస్ అల్ ఖైమాలోని కేంద్రం, అజ్మాన్‌లోని అల్ నుయిమియా మెడికల్ ఎగ్జామినేషన్ సెంటర్ ఫర్ రెసిడెన్సీ, అబుదాబిలోని జెనెటిక్ నియోనాటల్ స్క్రీనింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా ఉంది. మీకు సమీపంలో ఉన్న EHS సౌకర్యాలను తెలుసుకోవడానికి  EHS వెబ్‌సైట్‌ను సందర్శించాలి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com