19 ఏళ్ళ కుర్రాడి చేతిలో ఫెదరర్ ఓటమి
- June 19, 2016
టెన్నిస్ చరిత్రలో పదిహేడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సొంతం చేసుకున్న విజేత రోజర్ ఫెదరర్. గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవున్నాడు. తాజాగా హల్లె ఓపెన్ సెమీఫైనల్లో 19 ఏళ్ల జర్మనీ కుర్రాడు జ్వెరెవ్ చేతిలో ఓటమి చవిచూశాడు. దీంతో 9వ సారి హల్లె టైటిల్ సొంతం చేసుకోవాలనుకున్న ఫెదరర్ ఆశలు నెరవేరలేదు. ఎనిమిది సార్లు హాల్లె టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్న రోజర్‌ను శనివారం రాత్రి జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 19 ఏళ్ల యువ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ 7-6 (4), 5-7, 6-3 తేడాతో ఓడించాడు. పదేళ్ల తర్వాత స్విస్ స్టార్ ఓ యువకుడి చేతిలో పరాజయం పాలవడం ఇదే తొలి సారి. 2006లో బ్రిటన్ స్టార్ ప్లేయర్ ఆండీ ముర్రే.. ఫెదరర్‌ను ఓడించాడు. జ్వెరెవ్ తన కెరీర్లో రెండో ఏటీపీ టూర్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. మరో సెమీ ఫైనల్ల్లో ఆస్ట్రేలియాకు చెందిన డొమినిక్ థీమ్, జర్మనీ ఆటగాడు ఫ్లోరియన్ మెయర్ తలపడనున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







