భారీగా సంపాదిస్తున్న దర్శకుడు
- June 19, 2016తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేది ఎవరు అంటే, అది కచ్ఛితంగా హీరోలే అని అంటారు. ఎందుకంటే హీరోలు లేనిదే సినిమాని చూడటం కష్టం కనుక. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకి కథ కంటే హీరోలే ఎక్కువ అనేది చాలా సందర్భాల్లో రుజువు కూడ అయింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క హీరోలు మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటర్స్ నుండి ప్రతి ఒక్కరూ హీరోల కంటే అత్యధిక రెమ్యునరేషన్ ని సంపాదిస్తున్న వారే. ఒకప్పుడు హీరోలు మాత్రమే ఇండస్ట్రీలో సంపాదించుకునేందుకు ఛాన్స్ ఉంది. ఇప్పుడు డిజిటల్ విప్లవం వల్ల...ఎక్కువ మొత్తంలో సంపాదించుకునేందుకు ఎన్నో మార్గాలు వచ్చాయి.
వాటన్నింటిని చక్కగా ఉపయోగించుకుంటున్న దర్శకుడు మారుతి.
తను ఒకవైపు డైరెక్టర్ గా పనిచేస్తూనే మరోవైపు చిన్న చిత్రాలను నిర్మిస్తున్నాడు. అలాగే చిన్న చిత్రాలకి డిస్ట్రిబ్యూటర్ గానూ చేస్తున్నాడు. ఇలా ఒక సంవత్సర సమయంలో దర్శకుడు మారుతి సంపాదించేది...హీరో మహేష్ బాబు కంటే ఎక్కువుగా ఉందని అంటున్నారు.
ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో మారుతి చేస్తున్న సినిమా బాబు బంగారం. ఈ మూవీతో పాటు మరో నాలుగు చిత్రాల్లో పెట్టుబడులు పెట్టారని అంటున్నారు. అలాగే కొన్ని చిత్రాలకి డిస్ట్రిబ్యూటర్ గానూ చేస్తున్నారు. ఇలా మారుతి హీరోల కంటే ఎక్కువ సంపాదించేస్తూ మంచి సక్సెస్ లో ఉన్నారని అంటున్నారు. ఇక తను డైరెక్ట్ చేస్తున్న బాబు బంగారం మూవీ మంచి సక్సెస్ ని సాధించిందంటే తను పెద్ద హీరోలతో వరుసపెట్టి పని చేయటం ఖాయం అని అంటున్నారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







