1.6%కి చేరుకున్న సౌదీ అరేబియా ద్రవ్యోల్బణం..!!

- September 16, 2024 , by Maagulf
1.6%కి చేరుకున్న సౌదీ అరేబియా ద్రవ్యోల్బణం..!!

రియాద్: సౌదీ జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) తాజా నివేదిక ప్రకారం, సౌదీ అరేబియాలో వార్షిక ద్రవ్యోల్బణం ఆగస్టు 2024లో 1.6%కి చేరుకుంది. హౌసింగ్, నీరు, విద్యుత్, గ్యాస్,  ఇతర ఇంధనాల రంగాల ధరలలో 8.9% పెరుగుదలతోపాటు ఆహార పానీయాల ధరలలో 0.9% పెరుగుదల ఈ పెరుగుదలకు దారితీసింది. దీనికి విరుద్ధంగా, రవాణా రంగంలో ధరలు 3.4% తగ్గాయని పేర్కొంది. అద్దెలు 10.7% పెరిగగా, అపార్ట్‌మెంట్ అద్దెలలో 10.8% పెరుగటం ద్రవ్యోల్బణ రేటును గణనీయంగా ప్రభావితం చేసింది. ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోల్చితే సౌదీ ద్రవ్యోల్బణం సాధారణంగా తక్కువగానే ఉంటుందని క్యాపిటల్ ఎకనామిక్స్ స్పష్టం చేసారు.  సంవత్సరం ద్వితీయార్ధంలో 2%కి స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com