వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు అప్డేట్

- September 17, 2024 , by Maagulf
వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు అప్డేట్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా హత్యాచార ఘటనపై మంగళవారం సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది.

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నిద్ర పోవట్లేదని, నిజాన్ని వెలికితీసేందుకు వారికి కొంత సమయం ఇవ్వాలని ఈసందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అలాగే బాధితురాలి ఫొటో, పేరును వికీపీడియా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఆదేశించింది.

సుప్రీంకోర్టు గత ఆదేశాల మేరకు ఈ కేసుకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్‌ను సీబీఐ తాజాగా సమర్పించింది. దానిలో పేర్కొన్న విషయాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు గుర్తించిన వివరాలను బయటపెట్టడం వల్ల దర్యాప్తుపై ప్రభావం పడొచ్చని పేర్కొంది. వాస్తవాలను వెలికితీయడం దర్యాప్తు లక్ష్యమని వెల్లడించింది. ప్రిన్సిపల్, స్టేషన్ హౌస్ ఆఫీసర్(SHO)ను అరెస్టు చేశారని, దర్యాప్తు పూర్తయ్యేవరకు వేచిచూద్దామని తెలిపింది. ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత సీబీఐకి కేసు అప్పగించడం వల్ల పలు సవాళ్లు ఎదురవుతున్నాయని, కేసులో పురోగతి పరిమితంగా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com