బహ్రెయిన్ లో మరో 15 ట్రాఫిక్ సర్వీసులు డిజిటైజ్..!!

- September 20, 2024 , by Maagulf
బహ్రెయిన్ లో మరో 15 ట్రాఫిక్ సర్వీసులు డిజిటైజ్..!!

మనామా: 15 ట్రాఫిక్ సేవలతోపాటు 100% డిజిటలైజేషన్‌ పూర్తయినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ బ్రిగేడియర్ షేక్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ అబ్దుల్‌వాహబ్ అల్ ఖలీఫా ప్రకటించారు. అంతర్గత మంత్రి జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా అధ్యక్షతన ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ కోసం మంత్రివర్గ కమిటీ పర్యవేక్షణలో ఇన్ఫర్మేషన్ అండ్ ఇ-గవర్నమెంట్ అథారిటీ (iGA) సహకారంతో ఇది విజయవంతం అయినట్లు తెలిపారు. కొత్తగా డిజిటలైజ్ చేసిన సేవల్లో GCC పౌరుల కోసం వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ల వార్షిక పునరుద్ధరణ, జరిమానా లేదా ID నంబర్‌ని ఉపయోగించి ప్రభుత్వ , గల్ఫ్ వాహనాలకు ట్రాఫిక్ జరిమానాలను చెల్లించడం, మోటారుసైకిల్ డ్రైవింగ్ టెస్ట్‌ల బుకింగ్‌, వివిధ వాహన వర్గాల ప్రైవేట్ కార్లు, మోటార్‌సైకిళ్లు, ట్రక్కులు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రవాణా వాహనాలకు డ్రైవింగ్ లెర్నింగ్ లైసెన్స్‌లను జారీ చేయడం ఉన్నాయి. వీటితోపాటు ప్రైవేట్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు డ్రైవింగ్ టెస్ట్‌ల కోసం బుకింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం, వినియోగదారుల అభిప్రాయం ఆధారంగా సేవా నాణ్యత, సామర్థ్యాన్ని నిరంతరం మెరుగుపరచడం వంటి అప్డేట్ పనులు జరుగుతున్నాయని బ్రిగేడియర్ షేక్ అబ్దుల్‌రహ్మాన్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com