లడ్డు బాధ్యుల పై చర్యలు: డిప్యూటీ సీఎం పవన్
- September 20, 2024విజయవాడ: తిరుమల లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించడం అందరి మనోభావాలను దెబ్బతీసిందన్నారు. వైసీపీ హయాంలో ఉన్న టీటీడీ బోర్డే దీనికి సమాధానం చెప్పాలన్నారు.ఈ సందర్భంగా సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటుపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలకు సంబంధించిన పలు అంశాలను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ధార్మిక పద్ధతులు, అన్ని సమస్యలు పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో 'సనాతన ధర్మ రక్షణ బోర్డు'ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దీనిపై అన్ని వర్గాల వారితో జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వాటిల్లినా అందరూ కలిసికట్టుగా నిర్మూలించాలన్నారు.
తాజా వార్తలు
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం
- తిరుమల తిరుపతి శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరం ఏమిటి? ఎందుకు?
- ఇండియాకు పన్నెండు ఐఫోన్ 16 తీసుకొస్తూ.. పట్టుబడ్డ ప్రయాణికులు..!!
- అబుదాబిలో వేటాడుతూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వేటగాళ్లు..!!
- సౌదీ అరేబియాలో ఇన్‌బౌండ్ విజిటర్స్ వ్యయంలో 8.2% వృద్ధి..!!
- GCC-IMF సమావేశం.. ‘ఎకనామిక్స్ ఛాలెంజెస్’పై కీలక సమీక్ష..
- ఎక్స్పో సిటీ దుబాయ్.. మాస్టర్ ప్లాన్‌కు షేక్ మహమ్మద్ ఆమోదం..!!