తెలంగాణ: గల్ఫ్ కార్మికులకు భరోసా…సీఎం రేవంత్ ని కలిసిన NRI సెల్
- September 21, 2024
హైదరాబాద్: ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగానే గల్ఫ్ కార్మికులకు భరోసా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ కృతజ్ఞతలు తెలియజేసింది. సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రిని ఎన్‌ఆర్‌ఐ సెల్ చైర్మన్ డాక్టర్ బిఎం వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలిసింది.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని చెప్పారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్చం అందించి శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. సీఎంను కలిసిన వారిలో బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, గల్ఫ్ జేఏసీ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ఇతర నేతలు మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాసరావు, తోట ధర్మేందర్, రవిగౌడ్ తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..