ఎమోషనల్ రీయూనియన్.. 3 ఏళ్ల భర్తను కలుసుకున్న భార్య..!!

- September 21, 2024 , by Maagulf
ఎమోషనల్ రీయూనియన్.. 3 ఏళ్ల భర్తను కలుసుకున్న భార్య..!!

యూఏఈ: తప్పిపోయిన తన భర్తను వెతుకుతూ యూఏఈ వచ్చిన భారతీయ మహిళ కల ఫలించింది. దాదాపు 3 ఏళ్ల తర్వాతన తన భర్తను కలుసుకుని ఎమోషనల్ అయింది. భారతీయ మహిళ కథనాలు వైరల్ కావడంతో.. సెప్టెంబర్ 19న అబుదాబికి చెందిన పాకిస్తానీ టెక్నీషియన్ అలీ హస్నైన్ వాటిని చూసాడు. 3 ఏళ్ల క్రితం తప్పిపోయిన సంజయ్ మోతీలాల్ పర్మార్( 53) ఖలీఫా స్ట్రీట్‌లో తమతోనే నివసిస్తున్నట్లు పోలీసులకు వెల్లడించాడు. సమాచారం అందుకున్న అతని కొడుకు ఆయుష్, భార్య కోమల్ భావోద్వేగానికి గురయ్యారు.  దుబాయ్ నుండి అబుదాబికి చేరుకున్న వారు సంజయ్ ను చూసి ఎమోషనల్ అయ్యారు. ఆర్థిక ఇబ్బందులు, విపరీతమైన అపరాధభావం కారణంగా తన కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయని సంజయ్ వెల్లడించాడు. “నేను భారతీయ రిక్రూట్‌మెంట్ ఏజెంట్‌చే మోసపోయాను. నా పేరుకు ఒక్క పైసా కూడా లేకుండా నేను నిరాశ్రయుడిని అయ్యాను. నా వీసా గడువు ముగిసింది. జరిమానాలు చెల్లించడానికి నాకు మార్గం లేదు. ”అని అతను వివరించాడు. తన బాధను చూసిన అలీ హస్నైన్, అతన సోదరుడు మహ్మద్ నదీమ్ తనకు ఆశ్రయం ఇచ్చారని తెలిపారు.  2021 నుండి సంజయ్ కుటుంబం భారతీయ రాయబార కార్యాలయానికి అనేక లేఖలు రాసింది.  గుజరాత్‌లోని స్థానిక నాయకులను సహాయం చేయమని కోరింది. ఇన్నాళ్లకు వారి కల నెలవేరింది. సంజయ్ ఇప్పుడు యూఏఈ క్షమాభిక్ష కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. తన కుటుంబంతో తన జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాడు. సెప్టెంబర్ 1 నుండి అక్టోబరు 30 వరకు అమల్లో ఉన్న ప్రోగ్రామ్, చట్టవిరుద్ధంగా నివసించే వ్యక్తులు వారి స్థితిని క్రమబద్ధీకరించడానికి లేదా పెనాల్టీలు లేకుండా దేశం విడిచి వెళ్ళడానికి అవకాశాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.  తప్పిపోయిన భర్తను వెతకడానికి కోమల్ సెప్టెంబర్ 8న గుజరాత్‌లోని తమ స్వస్థలమైన వడోదర నుండి తన కుమారుడు ఆయుష్‌తో కలిసి దుబాయ్‌కి వచ్చిన సంగతి తెలిసిందే.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com