జూ.ఎన్టీఆర్ ఎమోషనల్.. అభిమానులకు దేవర కీలక విన్నపం…
- September 23, 2024
హైదరాబాద్: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. తనకు చాలా బాధగా ఉందంటూ ఫ్యాన్స్ కోసం ఓ వీడియోని రిలీజ్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం తనకు చాలా బాధగా ఉందన్నారాయన. నాకు ఎంత బాధగా ఉంటుందో అందరికీ తెలుసన్నారు. అవకాశం దొరికినప్పుడు అభిమానులతో సమయం గడపాలని, దేవర సినిమా గురించి, దేవర సినిమా కోసం మేము పడిన కష్టం గురించి అభిమానులందరికీ వివరిద్దామని అనుకున్నానని తెలిపారు.
కానీ, సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈవెంట్ ను క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని జూ.ఎన్టీఆర్ వాపోయారు. మీతో పాటు నేను కూడా బాధపడుతున్నా. మీకంటే కూడా నా బాధ ఇంకా పెద్దదని ఆవేదన వ్యక్తం చేశారు.
”ఇలా జరిగిందని ఎవరినీ కూడా నిందించొద్దు. దేవర నిర్మాతలనో లేక ఈవెంట్ ఆర్గనైజర్లను బ్లేమ్ చేయడం తప్పు అనేది నా ఫీలింగ్. మీరు చూపించే ప్రేమకి జీవితాంతం రుణపడి ఉంటా. ఈరోజు మనం కలవకపోయినా, సెప్టెంబర్ 27వ తేదీన మనమందరం కలవబోతున్నాం. దేవర సినిమాను మీరంతా చూడబోతున్నారు. ఎప్పుడూ మీకు నేను చెప్పినట్లే.. మీరూ కాలర్ ఎగరేసుకుని తిరిగేలా చేయడమే నా బాధ్యత. దాంతో వచ్చే ఆనందం ఎంతో.. మాటల్లో నేను చెప్పలేను.
సెప్టెంబర్ 27వ తేదీన అదే జరుగుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నా. శివ ఎంతో కష్టపడి, ఎంతో అద్భుతమైన సినిమా తీశారు. అందరూ చూడండి, అందరూ ఆనందించండి. అన్నింటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకు, నాకు చాలా అవసరం. దయచేసి మీ ఆశీర్వచనాలను మాకు అందిస్తారని మేము కోరుకుంటున్నాం. అదే సమయంలో మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని మరోసారి గుర్తు చేస్తున్నా” అని జూ.ఎన్టీఆర్ అన్నారు.
కాగా, ఆదివారం హైదరాబాద్ లోని నోవాటెల్ లో జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ అనూహ్యంగా క్యాన్సిల్ అయ్యింది. అనుమతించిన దాని కన్నా ఎక్కువ సంఖ్యలో ఫ్యాన్స్ తరలివచ్చారు. వారిని కంట్రోల్ చేయడం కష్టతరంగా మారింది. భద్రతాపరమైన కారణాలతో నిర్వాహకులు ఈవెంట్ ను రద్దు చేస్తూ డెసిషన్ తీసుకున్నారు. కాగా, ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఒకానొక దశలో ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. హోటల్ అద్దాలను ధ్వంసం చేశారు. దాంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







