UN సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్‌.. యువత, మహిళా సాధికారతపై సౌదీ కీ స్పీచ్..!!

- September 23, 2024 , by Maagulf
UN సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్‌.. యువత, మహిళా సాధికారతపై సౌదీ కీ స్పీచ్..!!

న్యూయార్క్:  UN సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్‌లో కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి ఇంజినీర్ అబ్దుల్లా అల్-స్వాహా తన ప్రసంగంలో యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రారంభించిన యువత, మహిళల సాధికారతపై కీ నోట్ ను ప్రవేశపెట్టారు. సౌదీ అరేబియాలో విజయవంతమైన ఈ చొరవను వివరించారు. సాంకేతికత, ఆవిష్కరణలతో పాటు మహిళలు యువత సాధికారత ద్వారా ఆర్థిక వైవిధ్యతకు ప్రపంచ వేగాన్ని పెంపొందిస్తుందని అల్-స్వాహా పేర్కొన్నారు.

"హోప్ ఆఫ్ డిజిటల్" సెషన్‌లో సౌదీ అరేబియా టెక్ సెక్టార్‌లో అత్యధిక శాతం మహిళల భాగస్వామ్యాన్ని సాధించిందని, కేవలం ఆరేళ్లలో 35%కి చేరుకుందని, ఈయూ, G20 సగటులను అధిగమించిందని ఆయన తెలిపారు. "సౌదీ కోడ్స్" ప్రోగ్రాం ద్వారా ఒక మిలియన్ మంది వ్యక్తులకు శిక్షణనిచ్చిన మిస్క్ ఫౌండేషన్ నేతృత్వంలోని ప్రోగ్రామింగ్‌లలో మహిళలు యువత గణనీయమైన భాగస్వామ్యంతో అద్భుతమైన విజయాలను సాధించారని మంత్రి వివరించారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలి ముస్లిం అరబ్ మహిళా వ్యోమగామి రయ్యానా బర్నావిని పంపిన ఘనతను కూడా ఆయన షేర్ చేశారు. ఈ కార్యక్రమాలు సౌదీ అరేబియాను వివిధ గ్లోబల్ ఇండెక్స్‌లలో ముఖ్యంగా UN E-గవర్నమెంట్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ 2024లో అధిక ర్యాంకింగ్‌లను సాధనకు దోహదం చేశాయని అల్-స్వాహా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నాల్గవ స్థానంలో..  డిజిటల్ సేవల సూచికలో G20 దేశాలలో రెండవ స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com