తగ్గిన బంగారం ధర

- June 20, 2016 , by Maagulf
తగ్గిన బంగారం ధర

డిమాండు లేమితో సోమవారం పసిడి ధర తగ్గింది. రూ.150 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,650కి చేరింది. కీలక సమయాల్లో నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1.4శాతం తగ్గి 1,280.47 యూఎస్‌ డాలర్లకు చేరింది.
వెండి సైతం పసిడి దారిలోనే పయనించింది. రూ.160 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.41,200కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేయకపోవడంతో దీని ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.
అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు వెండి ధర 17.36 యూఎస్‌ డాలర్లుగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com