యాపిల్ యూజర్లకు హైరిస్క్ వార్నింగ్...
- September 23, 2024
ఐఫోన్ సహా ఆపిల్ ఉత్పత్తులు హైరిస్క్ జోన్ లో ఉన్నాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సెర్ట్ ఇన్) హెచ్చరించింది. సెర్ట్ ఇన్ (ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం) అనేది భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ. ఇది సైబర్ దాడులు, భద్రతా లోపాలు, మరియు ఇతర సైబర్ ప్రమాదాలను గుర్తించి, వాటిని నివారించడానికి చర్యలు తీసుకుంటుంది. తాజాగా సెర్ట్ ఇన్ ఇటీవల కొన్ని ఆపిల్ ఉత్పత్తులు హైరిస్క్ జోన్ లో ఉన్నాయని హెచ్చరించింది.
సెర్ట్ ఇన్ ప్రకారం, ఆపిల్ ఉత్పత్తులు హ్యాకర్ల దాడులకు గురయ్యే ప్రమాదం ఉందని ఈ నెల 19న విడుదల చేసిన ఒక అడ్వైజరీలో, ఐఓఎస్, ఐపాడ్ ఓఎస్, మాక్ ఓఎస్, వాచ్ ఓఎస్, విజన్ ఓఎస్ వంటి పలు ఆపిల్ సాఫ్ట్ వేర్ వెర్షన్లలో సాంకేతిక లోపాలు ఉన్నాయని పేర్కొంది.
ఈ సాంకేతిక లోపాలు కారణంగా, హ్యాకర్లు ఆపిల్ పరికరాలపై దాడి చేసి, వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు, సిస్టమ్ మీద నియంత్రణ సాధించవచ్చు, స్పూఫింగ్ దాడులకు పాల్పడవచ్చు. సెర్ట్ ఇన్ ప్రకారం, 18 లేదా 17.7కి ముందు ఉన్న ఐఓఎస్ వెర్షన్లు వాడే యూజర్లు డాస్ అటాక్స్కు గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే, మాక్ ఓఎస్ పాత వెర్షన్లను వాడే యూజర్లకు డేటా మ్యానిపులేషన్ వంటి సమస్యలు ఎదురుకావచ్చు. టీవీఓఎస్, వాచ్ ఓఎస్ ఉత్పత్తులు వాడే యూజర్లకూ డాస్ దాడులు ఎదురయ్యే అవకాశం ఉంది.
సెర్ట్ ఇన్ సూచనల ప్రకారం, యూజర్లు తమ పరికరాలను తాజా సాఫ్ట్ వేర్ వెర్షన్లతో అప్ డేట్ చేసుకోవాలి. అలాగే, తమ పరికరాలపై అనుమానాస్పద కార్యకలాపాలను పర్యవేక్షించాలి. ఈ విధంగా, యూజర్లు తమ పరికరాలను సురక్షితంగా ఉంచుకోవచ్చు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







