‘బిగ్’ పాలిట్రిక్స్.! సోనియా మామూలు ముదురు కాదండోయ్.!
- September 24, 2024
బుల్లితెర బిగ్ గేమ్ షో బిగ్‌బాస్ 8వ సీజన్‌కి సంబంధించి సోనియా ఆకుల సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది. మొదటి మూడు రోజుల్లో హౌస్‌లో అనవసరమైన గొడవలకు కారణమైనట్లుగా కనిపించిన సోనియా ఓ పద్ధతిగా తన ఆటను సాగిస్తోంది.
మొదట నిఖిల్‌ని తన వైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత పృధ్వీని తన టీమ్‌లోకి లాగేసింది. ఇలా ఈ ముగ్గురూ ఒక టీమ్‌గా మెలగుతున్నారు హౌస్‌లో.
అంతేకాదు, సోనియాకి హౌస్‌లో మిగిలిన కంటెస్టెంట్ల నుంచి చాలా నెగిటివిటీ వుంది. టాస్క్‌లకు సంబంధించి, ఆమె బిహేవియర్‌కి సంబంధించి హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్లలో చాలా చాలా కంప్లైయింట్సే వున్నాయ్.
నిఖిల్‌నీ, పృద్వీని అడ్డు పెట్టుకుని తను గేమ్ ఆడుతోందనీ, కన్నింగ్ గేమ్ ఆడుతోందన్న ఆరోపణలున్నాయ్.
అలాగే, సోనియాపై ఈగ కూడా వాలకుండా చూసుకుంటున్నారు ఆ ఇద్దరూ హౌస్‌లో. నామినేషన్ల ఎపిసోడ్‌లో హౌస్‌లో చాలా మంది సోనియాని నామినేట్ చేస్తూ కారణాలు వివరిస్తుండగా.. సోనియాకి సపోర్ట్‌గా నిలిచారు నిఖిల్, పృధ్వీ.
ఇలా చూసుకుంటూ పోతే, నిజంగానే సోనియా గేమ్ ప్లాన్ వేరే లెవల్ వుంది. చూడాలి మరి, ఈ ప్లానింగ్‌తో సోనియా ఎన్ని రోజులు హౌస్‌లో సక్సెస్‌ఫుల్‌గా వుండగలదో.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







