చికున్ గున్యా ఫీవర్ లక్షణాలేంటీ.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?
- September 24, 2024
దోమకాటు కారణంగా సంభవించే వైరస్ వ్యాధి చికున్ గున్యా. అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం ఈ వైరస్ గురించి ఎక్కువగా వినిపించింది. అప్పట్లో దాదాపు చాలా మంది ఈ వైరస్ బారిన పడి బాధపడ్డారు.
మళ్లీ ఇటీవల కాలంలో చికున్ గున్యా వైరస్ విజృంభిస్తోంది. పగలు మాత్రమే సంచరించే ఈ దోమ కుట్టిన 3 నుంచి 7 రోజుల వ్యవధిలో హై ఫీవర్ స్టార్ట్ అవుతుంది.
తీవ్రమైన తలనొప్పితో కూడిన జ్వరం రెండు నుంచి మూడు రోజుల్లో తగ్గుతుంది. ఆ తర్వాతే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. జాయింట్ పెయిన్స్ విపరీతంగా మొదలవుతాయ్.
నడవలేని పరిస్థితిలో జాయింట్ పెయిన్స్ ఇబ్బంది పెడుతుంటాయ్. కొందరిలో పాదాల వాపులు, దద్దుర్లు కూడా కనిపిస్తాయ్. కళ్లు ఎర్రగా మారడం.. విపరీతమైన ఒళ్లు నొప్పులతో బాధపడుతుంటారు. శరీర తత్వాన్ని బట్టి కొందిరికి నాలుగు వారాల్లో తగ్గుతుంది. మరికొందరికి రెండు నుంచి మూడు నెలల పాటు కూడా ఈ బాడీ పెయిన్స్ ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
మరి, చికిత్స ఏంటంటారా.? టెంపరరీగా ఫీవర్ కంట్రోల్ మెడిసన్స్, అలాగే పెయిన్ కిల్లర్స్ వాడడం తప్ప ప్రత్యేకమైన చికిత్స ఏమీ లేదని నిపుణులు చెబుతున్నారు.
కానీ, వాటర్ ఎక్కువగా తాగడం, ఫ్రూట్ జ్యూస్‌లు, రాగి జావ తదితర లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. సెల్ఫ్ హైజీనిక్ పాఠించాలి. దోమల నివారణకు వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇది అంటువ్యాధా.? అంటే కాదని చెబుతున్నారు. కేవలం దోమ కాటు కారణంగా మాత్రమే ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ సంక్రమిస్తుంది. రోగిని తాకడం, సదరు వైరస్ సోకిన వ్యక్తితో సంచరించడం వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్