కళ్లకింద నల్లటి వలయాలాకు ఉపశమనo

- June 20, 2016 , by Maagulf
కళ్లకింద నల్లటి వలయాలాకు  ఉపశమనo

అధిక ఒత్తిడీ, నిద్రలేమి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, అదేపనిగా స్మార్ట్‌ఫోన్‌ వాడటం వంటివన్నీ కళ్లకింద నల్లని వలయాలకి కారణాలవుతాయి. ఆ సమస్య నుంచి ఉపశమనానికి..టొమాటో: ఇందులోని లైకోపీన్‌ అనే ఫైటో కెమికల్‌కి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే గుణం ఉంది. చెంచా టొమాటో రసానికి ఒక చెంచా నిమ్మరసం కలిపి కళ్లకింద రాయాలి. పది నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది. రోజులో రెండు సార్ల వంతున వారంపాటూ చేస్తే కళ్లకింద వలయాలు తగ్గుముఖం పడతాయి.విటమిన్‌ సి: విటమిన్‌ 'సి'కి శరీరపు రంగుని మెరుగు పరిచే గుణం ఉంది. అందులోనూ నిమ్మజాతికి చెందిన పళ్లకు ఈ గుణం ఇంకాస్త ఎక్కువ.అందుకే కమలా పండుకానీ, బత్తాయి రసంకానీ చెంచాడు తీసుకుని దానిలో కాస్త గ్లిజరిన్‌ కలిపి నల్లగా ఉన్నచోట సున్నితంగా రాయాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. వారంలో ఇలా మూడు సార్లు చేయొచ్చు.'గ్రీన్‌ టీ' బ్యాగులు: టీ బ్యాగులకి నల్లని వలయాలు తగ్గించే గుణం ఉంది. అయితే దీన్ని కాసేపు నీటిలో నాననిచ్చి ఆ తర్వాత ఫ్రిజ్‌లో పది నిమిషాలపాటు ఉంచాలి. ఆ తర్వాత కళ్లమీద పెట్టుకుంటే చాలా ఉపశమనంగా ఉంటుంది. పదినిమిషాలపాటూ ఇలా ఉంచాలి.
పుదీనా ఆకులు: తాజా పుదీనా ఆకులు గుప్పెడు తీసుకుని కొద్దిగా నీళ్లు చిలకరించి ముద్దగా చేసుకోవాలి. దాన్ని కళ్లకింద మునివేళ్లతో సుతిమెత్తగా అద్ది ఆరిన తర్వాత కడిగేయాలి.పాలు: పాలని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి (పచ్చిపాలు మేలు!) దూదిని ముంచి కళ్లకింద ఉంచాలి. పాలలోని లాక్టిక్‌ ఆమ్లం కళ్లకింద వలయాలని సులభంగా తొలగిస్తుంది.
బాదం గింజలు: పచ్చిపాలల్లో నాలుగు బాదం గింజల్ని నాననిచ్చి, మెత్తగా నూరి ఆ ముద్దని కళ్లకింద పట్టిస్తే మంచిది. బాదంలో విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటుంది. దీనికి చర్మపు ఛాయని మెరుగుపరిచే గుణం ఎక్కువ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com