డయాబెటిక్స్ ప్రత్యేకంగా తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఏంటో తెలుసా.?

- September 25, 2024 , by Maagulf
డయాబెటిక్స్ ప్రత్యేకంగా తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఏంటో తెలుసా.?

డయాబెటిక్ ఒక్కసారి ఎటాక్ అయ్యిందంటే చాలు జీవితాంతం దాంతో సహజీవనం చేయాల్సిందే. ఆఫ్ట్రాల్ షుగరే కదా.. అని తీసి పారేయడానికి లేదు. డయాబెటిస్‌తో పాటూ అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయ్. కంట్రోల్‌లో వుంచుకోకపోతే వచ్చే ప్రమాదాలు అన్నీ ఇన్నీ కావు.

అందుకే తీసుకునే మెడిసన్స్‌తో పాటూ, కొన్ని రకాల ఫుడ్ డైట్స్ కూడా ఫాలో చేయాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డయాబెటిస్ వున్నవారు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌గా ఇడ్లీ, దోసె వంటివి తీసుకోవడం కన్నా.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఐటెమ్స్‌ని తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్‌లో వుంటుంది.

ఓట్స్‌లో కార్భోహై్డ్రేట్స్ ఎక్కువగా వుంటాయ్. వీటిని బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకోవడం వల్ల కడుపు నిండుగా వున్న ఫీల్ కలుగుతుంది. తొందరగా ఆకలి వెయ్యదు. తద్వారా లంచ్‌లో తీసుకునే ఆహారం తగ్గుతుంది. ఫైబర్ ఎక్కువగా వుండడం వల్ల కొంచెం కొంచెంగా జీర్ణమవుతుంది. తక్షణ శక్తినిస్తుంది. అందుకే గ్లూకోజ్ లెవల్స్ తగ్గుతాయ్.

బియ్యం కన్నా, పెసరపప్పుతో చేసిన ఆహార పదార్ధాలు షుగర్ పేషెంట్లకు చాలా మంచివి. వీటిలో బీన్స్, టమాటా, పాలకూర వంటి కొన్ని కూరగాయల్ని మిక్స్ చేసి తినడం వల్ల ఫైబర్ పెరుగుతుంది. జీర్ణ శక్తి మెరుగవుతుంది.

డయాబెటిస్ వున్నవారికి మొలకలు లేదా స్ప్రౌట్స్ చాలా మంచి ఆహారం. పెసలు, బీన్స్ తదితర పప్పులను రాత్రి పూట నానబెట్టి వాటిని మొలకలు వచ్చాకా సలాడ్‌లా చేసుకుని తింటే రక్థంలోని గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్‌లో వుంటాయ్.

వీటితో పాటూ విటమిన్ సి, కె, బి, బి 2, బి3, కూడా శరీరానికి పుష్కలంగా అందుతాయ్. దాంతో, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు రెగ్యులర్‌గా ఫీలయ్యే నీరసం, అధిక ఆకలి వంటి సమస్యలు తగ్గుతాయ్. శక్తి లబిస్తుంది. షుగర్ కంట్రోల్‌లో వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com