బిగ్ హౌస్‌లో ఆధిపత్య పోరు.!

- September 25, 2024 , by Maagulf
బిగ్ హౌస్‌లో ఆధిపత్య పోరు.!

బిగ్ హౌస్‌లో ఆధిపత్య పోరు నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఎవరి మధ్యన.. అంటారా.? సోనియా ఆకుల మరియు యష్మి మధ్య. నామినేషన్ల పర్వంలో భాగంగా సోనియాని నామినేట్ చేసిన యష్మి చెప్పిన కారణాలు సోనియాకి అస్సలు నచ్చలేదు.

మొదటి రోజు నుంచే సోనియా కాస్త పాలిటిక్స్ ప్రదర్శిస్తూ వస్తోంది. హౌస్‌లోని లేడీస్ అందరి మీదా అనవసరమైన ఆరోపణలు చేస్తూ నోటికి ఎంతొస్తే అంత మాట విసిరేస్తోంది.

యష్మి ఆ పాయింట్‌నే రైజ్ చేసింది. కానీ, అది సోనియాకి నచ్చలేదు. నిజానికి యష్మి హౌస్‌లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. స్ట్రెయిట్ ఫార్వర్డ్ వుంటుంది. టాస్కుల్లోనూ తన బెస్ట్ ఇస్తూ వస్తోంది.

నిజానికి ఈ సీజన్ బిగ్‌బాస్‌కి విన్నర్ కావల్సిన లక్షణాలు యష్మిలో పుష్కలంగా కనిపిస్తున్నాయ్. అదే బహుశా సోనియాకి నచ్చలేదు కాబోలు. ఎంతైనా రామ్ గోపాల్ వర్మ రికమెండేషన్‌తో హౌష్‌లోకి ఎంటర్ అయ్యిందిగా. ఆ మాత్రం వుంటుందిలే.

అన్నట్లు, వెరీ లేటెస్ట్‌గా సోనియాకి ఓట్ చేయండంటూ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com