ప్రైవేట్ హాస్పిటల్ వర్కర్లకు రెండు నెలల వేతనాలు చెల్లింపు..!!
- September 26, 2024
మనామా: ఆగస్టులో పెండింగ్ జీతాల కోసం డిమాండ్ చేసిన ప్రైవేట్ ఆసుపత్రి ఉద్యోగులు తమ వేతనాలను అందుకున్నారని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జూలై, ఆగస్ట్ నెల జీతాలు చెల్లించినట్టు తెలిపింది. సెప్టెంబరు చివరిలో మిగిలిన చెల్లింపులు అవుతాయని పేర్కొంది. 50 మంది బహ్రెయిన్‌లతో సహా సుమారు 190 మంది సిబ్బందిని నియమించుకున్న ఆసుపత్రి, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న తర్వాత ప్రధాన సేవలను తగ్గించింది. కార్మికులకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. ఆగస్టు చివరిలో ఆసుపత్రిని ఔట్ పేషెంట్ కేర్‌కు మార్చినప్పుడు సాధారణ శస్త్రచికిత్స, ప్రసూతి వంటి 30 ప్రత్యేక సేవలు ప్రభావితమయ్యాయి. బాధిత బహ్రెయిన్ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధిని కనుగొనే ప్రయత్నాలను కూడా చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికీ పని లేని వారు తొమ్మిది నెలల వరకు లేదా వారు కొత్త ఉపాధిని పొందే వరకు వారి బీమా చేసిన వేతనంలో 60 శాతం పరిహారం పొందుతారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







