బంగ్లాదేశీయులకు క్షమాపణలు..మానవ హక్కుల సంఘాల ప్రశంసలు..!!
- September 27, 2024
యూఏఈ:ఇటీవల యూఏఈలో నిరసనల్లో పాల్గొన్న బంగ్లాదేశ్ జాతీయులకు క్షమాపణలు జారీ చేసిన నిర్ణయాన్ని మానవ హక్కుల సంస్థలు ప్రశంసించాయి. సదరు వ్యక్తులు భద్రత, పబ్లిక్ ఆర్డర్‌ను ప్రభావితం చేసే నేరాలకు పాల్పడ్డారని, వారుందరూ చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరాలకు పాల్పడి శిక్షించబడ్డారని తెలిపారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) 57వ సెషన్ సందర్భంగా అంతర్జాతీయ ప్రకటనను విడుదల చేసింది. యూనియన్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ నేతృత్వంలో 20కి పైగా అంతర్జాతీయ, ప్రాంతీయ, జాతీయ మానవ హక్కుల సంస్థలను కలిగి ఉంది. ఈ మానవ హక్కుల NGOలు క్షమాపణను అమలు చేయడానికి యూఏఈ అటార్నీ-జనరల్ తీసుకున్న వేగవంతమైన చర్యను ప్రశంసించాయి. ఇందులో జరిమానాలను రద్దు చేయడం, వారు స్వదేశానికి తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవడం వంటివి ఉన్నాయి. ఎమిరేట్స్ న్యాయ వ్యవస్థను కూడా ప్రశంసించారు.శిక్షల అమలు సమయంలో అందించిన మానవీయ పరిస్థితులు పద్ధతులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







