ధోఫర్‌లో సునామీ వాతావరణ మార్పులపై అవగాహన ప్రచారం..!!

- September 27, 2024 , by Maagulf
ధోఫర్‌లో సునామీ వాతావరణ మార్పులపై అవగాహన ప్రచారం..!!

మస్కట్:ధోఫర్ గవర్నరేట్‌లో వాతావరణ పరిస్థితులు, సునామీ ప్రమాదాల గురించి అవగాహన కల్పించేందుకు నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ కమిటీ  జాతీయ ప్రచారాన్ని నిర్వహించనుంది. వచ్చే ఆదివారం నుంచి అక్టోబర్ 7 వరకు ప్రచారం జరగనుంది. సెమినార్‌లు, ఎగ్జిబిషన్ మరియు ఇతర ఈవెంట్‌ల ద్వారా ఈ ప్రచారం సాగనుంది. సమాచార మంత్రిత్వ శాఖ, సివిల్ ఏవియేషన్ అథారిటీ, సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ, దోఫర్ గవర్నర్ కార్యాలయం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సోషల్ డెవలప్‌మెంట్, యూత్ సెంటర్ భాగస్వామ్యంతో ఈ ప్రచారంలో పాల్గొంటున్నాయని అధికార యంత్రాంగం వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com