సౌదీ అరేబియాలో వర్క్ వీసా నిబంధనల సవరణ.. ప్రైవేట్ రంగానికి ఊతం..!!

- October 02, 2024 , by Maagulf
సౌదీ అరేబియాలో వర్క్ వీసా నిబంధనల సవరణ.. ప్రైవేట్ రంగానికి ఊతం..!!

రియాద్:  హజ్ -ఉమ్రా సేవలకు తాత్కాలిక ఉద్యోగ వీసాలు, తాత్కాలిక పనిని నియంత్రించే నిబంధనలు మంత్రి మండలి ఆమోదించింది. దీంతో ఆకర్షణీయమైన కార్మిక మార్కెట్‌ను అందించడానికి దోహదం చేస్తాయని మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది.  నిబంధనలు ప్రైవేట్ రంగానికి వారి అవసరాలు, లేబర్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తాత్కాలిక వీసాల నుండి ప్రయోజనం పొందేందుకు అధిక అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. కొత్త సవరణలు కేబినెట్ ఆమోదం పొందిన తేదీ నుండి 180 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయని ఒక ప్రకటనలో మంత్రిత్వ శాఖ తెలిపింది.

షబాన్ 15 నుండి ప్రారంభమయ్యే వీసా గ్రేస్ పీరియడ్‌ని మొహర్రం ముగిసే వరకు పొడిగించారు. సీజనల్ వర్క్ వీసా పేరు కూడా హజ్ -ఉమ్రా సేవల కోసం తాత్కాలిక వర్క్ వీసాగా పేర్కొన్నారు.   వీసాల దుర్వినియోగానికి పాల్పడితే భారీ జరిమానాలతోపాటు జైలుశిక్షలు విధించనున్నట్లు హెచ్చరించారు. తాత్కాలిక వీసాల వ్యవధిని 90 అదనపు రోజులకు పొడిగించడం ద్వారా సంస్థలకు మరింత సౌలభ్యాన్ని కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com